పెనుకొండ మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పరిటాల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పెనుకొండ మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు Satya Sai Police వెల్లడించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.