మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన కిడారి సర్వేశ్వరరావు వర్ధంతి

రిపోర్టర్: శివ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పరిధిలోని డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన నాటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు సీవేరి సోమల ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మన్యం ప్రజలు ఆ విషాద ఘటనను గుర్తుచేసుకుంటున్నారు. ఎనిమిదేళ్ల కిందట సెప్టెంబర్‌ 23న జరిగిన ఈ దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్న వైనాన్ని స్థానికులు స్మరించుకుంటున్నారు.