భారత్ వైపు కన్నెత్తి చూస్తే తగిన మూల్యం తప్పదని ప్రధాని మోదీ హెచ్చరిక
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
పాకిస్తాన్ పై నిర్వహించిన తొలి సర్జికల్ దాడులకు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు జరిగిన 138వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని ప్రపంచానికి స్పష్టం చేశామన్నారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుండి ఆపరేషన్ సిందూర్ వరకు దేశం స్పష్టమైన సందేశం ఇచ్చిందని, శత్రువుల దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.