కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, కంటైనర్ ఢీకొని ఆరుగురికి తీవ్రగాయాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట సమీపంలో ఆర్టీసీ బస్సు, గ్రానైట్ కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. బస్సు డ్రైవర్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పందించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.