లక్సెట్టిపేటలో బాధితులకు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అందజేత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను పోలీసులు ట్రేస్ చేసి బాధితులకు తిరిగి అప్పగించారు. వివిధ పనులపై వెళ్ళి మొబైల్స్ కోల్పోయిన మాణిక్యం, చింతం శ్రీధర్, ఎడ్ల గంగన్న, పర్వీన్, అశోక్, మహర్షి ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వాటిని రికవరీ చేసి శనివారం స్టేషన్లో అందజేశారు.