మహాత్మా గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం: సైబరాబాద్ సీపీ రమేష్
రిపోర్టర్: రాము
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మహాత్మా గాంధీజీ ఆశయాలు, సత్యం మరియు అహింసా మార్గాలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ ఆదర్శమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్లో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీస్ పేర్కొంది. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. దేశం కోసం గాంధీ చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా స్మరించుకున్నారు.