ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: సిద్దిపేట

వ్యవసాయిక కేంద్రమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, గౌరవెల్లి, కలికోట సూరంపేట తదితర ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించిందని పొన్నం ప్రభాకర్ పేర్కొంటూ సామాజిక మాధ్యమాల వేదికగా కీలక ప్రకటన చేశారు.