పొదలకూరు గాయత్రి స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరు పట్టణంలోని శ్రీ గాయత్రి స్కూల్లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణుల వేషధారణలో ముస్తాబైన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, చిన్నారులకు చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేశారు. అనంతరం ఉట్టి మహోత్సవం నిర్వహించగా, కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.