ఎస్‌ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్ష రీషెడ్యూల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఉత్తర ప్రదేశ్

నొయిడాలోని ఆదర్శ పరీక్షా కేంద్రంలో సాంకేతిక సమస్యల కారణంగా సెప్టెంబర్ 8న జరగాల్సిన ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ టైర్-1 పరీక్షను సెప్టెంబర్ 13కి రీషెడ్యూల్ చేశారు. ఈ కేంద్రం మినహా మిగతా చోట్ల పరీక్ష షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ప్రభావిత అభ్యర్థులకు త్వరలో కొత్త హాల్ టికెట్లు జారీ చేయనున్నారు.