పోలీస్ ఉద్యోగార్థుల కోసం ఖమ్మంలో ఏఐవైఎఫ్ భారీ మోడల్ టెస్ట్
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
ఖమ్మంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ ఆరో తేదీన ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేక మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్యదర్శి చింతల రమేష్ కోరారు. ఈ కార్యక్రమ వివరాలను ఖానాపురం హవేలీ సీఐ నాగరాజుకు వివరించి ఆహ్వాన పత్రం అందజేశారు. కార్యక్రమంలో నానబాల రామకృష్ణ, రఫీ, శివ తదితర ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.