బొబ్బిలి శ్రీ చైతన్య కళాశాలలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో బ్రహ్మకుమారీస్ సెంటర్ ఇన్ఛార్జ్ రాజేశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం వ్యసన విముక్తి ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రిన్సిపాల్ వై.ప్రసాద్ సమక్షంలో 370 మంది విద్యార్థులు నషా ముక్త్ ప్రతిజ్ఞ చేసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

భారత్ అంతటా పది కోట్ల మందితో వ్యసన ముక్తి కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. స్వర్ణ భారత్ సాధన కోసం విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసక్తి గల విద్యార్థులు ఉచితంగా రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవాలని సూచించారు.