స్థానిక ఎన్నికల ప్రచారం: అభ్యర్థులు విధిగా అనుమతులు పొందాలని అధికారుల స్పష్టీకరణ

రిపోర్టర్: సునీల్ స్థలం: కలిగిరి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం విధిగా పోలీసు మరియు రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు పొందాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రచార రూపం, లౌడ్ స్పీకర్ల వినియోగం వంటి పూర్తి వివరాలతో ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహిస్తే నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తక్కువ సమయం ఉన్నవారు సింగిల్ విండో విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.