ఎమ్మిగనూరులో కిలో బంగారంతో ప్రత్యేకంగా మెరిసిన గోల్డ్ వినాయకుడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లావ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మిగనూరు పట్టణంలో శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామివారికి కిలో బరువున్న బంగారు ఆభరణాలు, కిలో బంగారు నాణేలతో అలంకరణ చేశారు. ఈ స్వర్ణ అలంకరణలో కొలువుదీరిన లంబోదరుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.