వైద్య ప్రవేశాల్లో జీవో 102 రద్దు చేయాలి: రఘువీరారెడ్డి డిమాండ్
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వం తెచ్చిన జీవో 102 వల్ల సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతోందని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి మండిపడ్డారు. 'ఆల్ ఆప్షన్స్' విధానాన్ని రద్దు చేయడం వల్ల 70 మంది రిజర్వ్‌డ్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. పాత జీవో 151ని పునరుద్ధరించి, మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. పారదర్శకత లేని ఈ విధానాన్ని వెంటనే సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.