ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా తప్పులపై సర్పంచ్ ఫిర్యాదు
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమంలో బోడ మాణిక్యం తండా గ్రామ సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్ ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. అధికారుల తప్పిదం వల్ల పేదల ఇళ్ల పేర్లు ఎల్3 జాబితాలో చేరడంతో, కలెక్టర్కు విన్నవించినా పరిష్కారం కాకపోవడంతో నేడు అధికారులను కలిసి ప్రస్తుత ఇంటి ఫోటోలతో దరఖాస్తు అందజేశారు. స్పందించిన ఎంపీడీవో వెంటనే విచారణకు ఆదేశించారు.