ఇండియా టూర్: వన్డే జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూజిలాండ్
భారత పర్యటనకు సంబంధించి బలమైన వన్డే జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ మెగా సిరీస్ నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుందని బోర్డు అధికారులు తెలిపారు. ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్ వంటి కీలక ఆటగాళ్లు చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇస్తుండగా, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కోసం రెండు దశలుగా ఈ స్క్వాడ్‌ను ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.