నటి నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువునష్టం దావా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గుజరాత్
బాలీవుడ్ నటి నోరా ఫతేహికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రైవేట్ చార్టర్డ్ విమానాన్ని ‘టాయ్ ప్లేన్’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి వ్యాపార నష్టానికి కారణమయ్యారంటూ డ్యూన్స్ ఏవియేషన్ సంస్థ గుజరాత్ కోర్టులో రూ.3 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసింది. సోషల్ మీడియాలో ఆ వీడియోలను తొలగించాలని కూడా కోరింది.