అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ ట్విట్టర్ రివ్యూ

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా నరేష్ కామెడీ టైమింగ్, ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అదిరిపోయిందని, సీనియర్ నరేష్ వన్ లైనర్లు నవ్విస్తున్నాయని ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా ప్రశంసిస్తున్నారు.