ముంబైలో దారుణం: డెలివరీ ఏజెంట్ పేరుతో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరణ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ముంబై

ముంబైలోని కాందివాలి ప్రాంతంలో డెలివరీ ఏజెంట్ గా నటిస్తూ ఓ దుండగుడు డోర్ డెలివరీ ముసుగులో అరాచకానికి పాల్పడ్డాడని సీనియర్ ఇన్స్పెక్టర్ కరణ్ కావాలే వెల్లడించారు. ఉమాన్ సొసైటీలో నివాసం ఉంటున్న డెబ్బై ఆరు సంవత్సరాల అరుణా అనిల్ కాంత్ రూపానీ అనే వృద్ధురాలు లిఫ్ట్ వద్ద నిలబడి ఉండగా, అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగతనం చేసి పరారయ్యాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.