కవిటిలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కవిటి

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బసవకొత్తూరులో శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అత్తాకోడళ్లు మహాలక్ష్మి, కుమారిలు ప్రమాదానికి గురయ్యారు.

వారిని కాపాడేందుకు ప్రయత్నించిన పక్కింటి మహిళ భాగ్యవతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.