ఫార్మా వ్యాపారి తండ్రి హత్య కేసులో కొడుకు సుబ్రత్ అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: కాన్పూర్
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సంచలనం సృష్టించిన ఫార్మా వ్యాపారి వినీత్ మినోచా హత్య కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు ఆయన కుమారుడు సుబ్రత్ను అరెస్ట్ చేశారు. భారీ అప్పులు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తండ్రిని హత్య చేయించేందుకు కుమారుడే సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసు కమిషనర్ రఘుబీర్ లాల్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కొనసాగుతోంది.