వైకాపా దౌర్జన్యాలపై వైఎస్ జగన్ను నిలదీసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

రిపోర్టర్: సతీష్ స్థలం: మంగళగిరి

వైకాపా హయాంలో మాచర్లలో తనపై హత్యాయత్నం చేయించిన విషయం మర్చిపోయారా అని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో వైకాపా నాయకులు తెదేపా అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు విత్డ్రా చేయించారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా పాల్పడిన దౌర్జన్యకాండను దేశం మొత్తం చూసిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.