భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసింది చంద్రబాబు ప్రశంస
రిపోర్టర్: సునీల్
స్థలం: Amaravati
భారత్ పై దాడి చేస్తే తగిన సమాధానం ఇచ్చే సత్తా దేశానికి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ శక్తి కారణంగానే దేశ రక్షణ వ్యవస్థ బలంగా మారిందని ఆయన కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చిందని చంద్రబాబు ప్రశంసించారు.