విద్యార్థుల నైపుణ్యాల పెంపునకు వంద రోజుల కార్యాచరణతో కలెక్టర్ గర్జన

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు నూతనంగా రూపొందించిన వంద రోజుల ప్రత్యేక కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు మరియు గణిత సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రెమిడియేషన్, ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేక క్యాంపెయిన్ పోస్టర్ను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.