వందేమాతర నినాదంతో మార్మోగిన పంతంగి గ్రామ సీమ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ గణవీర్ యువసేన గణేష్ మండపం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి మువ్వన్నెల పతాకానికి వందనం సమర్పించారు. భాగ్యనగర్ మరియు చౌటుప్పల్ గణేష్ ఉత్సవ సమితుల పిలుపు మేరకు ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆబాలగోపాలం కలసికట్టుగా పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించి తమ దేశభక్తిని ఘనంగా చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.