యూపీఐ చెల్లింపుల కోసం ఏఐ ఏజెంట్లను తీసుకురానున్న ఎన్‌పీసీఐ

రిపోర్టర్: అశోక్ స్థలం: India

యూపీఐ ద్వారా చిన్న డిజిటల్ చెల్లింపులు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు ఎన్‌పీసీఐ త్వరలో అనుమతి ఇవ్వనుంది. ప్రతి లావాదేవీకి యూజర్ ప్రమేయం లేకుండానే ఏఐ ఏజెంట్లు చెల్లింపులు చేసేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నారు. యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్ కింద ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ విలువైన కొనుగోళ్లు, కిరాణా సామాగ్రి కొనుగోళ్లకు ఇది తొలుత ఉపయోగపడనుంది.