నేడు కోవూరులో మంత్రి నారా లోకేశ్ పర్యటన
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
మంత్రి నారా లోకేశ్ బుధవారం కోవూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణతో పాటు పార్టీ క్యాడర్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఉషోదయ డెయిరీ పార్లర్ ఆవరణలో జరిగే ఈ సభలో నాయకులు, కార్యకర్తలకు లోకేశ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మంత్రి మహ్మద్ ఫరూఖ్ ఈ పర్యటనలో పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు.