అమెరికా వర్సిటీల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
రిపోర్టర్: శివ
స్థలం: United States
యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ 2027 ఉత్తమ కాలేజీల ర్యాంకింగ్స్లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత పదిహేనేళ్లుగా మొదటి స్థానంలో కొనసాగుతున్న ప్రిన్స్టన్ యూనివర్సిటీని వెనక్కి నెట్టి ఎంఐటి ఈ ఘనత సాధించింది. ఈ తాజా జాబితాలో ప్రిన్స్టన్ రెండో స్థానంలో నిలవగా, హార్వర్డ్ యూనివర్సిటీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. విద్యార్థుల గ్రాడ్యుయేట్ ఆదాయం వంటి నూతన కొలమానాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు.