బీఆర్ఎస్ అసమర్ధత వల్లే మేడిగడ్డ బ్యారేజి కూలిందన్న ఉత్తమ్ కుమార్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధత వల్లే మేడిగడ్డ బ్యారేజి కూలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని ఎన్.డి.ఎస్.ఏ రిపోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టింది, కూలిపోయింది కూడా కేవలం బీఆర్ఎస్ హయాంలోనే అని ఆయన స్పష్టం చేశారు.