అల్లినగరంలో వైభవంగా వినాయకుడి లడ్డు వేలం పాట

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్ల మండలం అల్లినగరం అమ్మవారి చెట్టు వద్ద గణపతి మండపంలో వినాయక లడ్డు వేలం పాట ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేలంలో స్వామివారి మహా లడ్డును డొంక చిన్న నారాయణమూర్తి రూ.38,500 లకు దక్కించుకున్నారు. అలాగే స్వామివారి మణిహారాన్ని కుప్పిలి శివరాజు రూ.7,800 లకు సొంతం చేసుకున్నారు. భక్తులకు స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలని శ్రీ శక్తి యువజన సంఘం సభ్యులు ఆకాంక్షించారు.