ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతల అరెస్ట్

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరును నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మేరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు మార్చ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల జోక్యంతో ఘర్షణ వాతావరణం నెలకొందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.