ముంబై వాసులకు హెచ్చరిక: ఏడు రోజుల పాటు నీటిని మరిగించి తాగాలి
రిపోర్టర్: మహేష్
స్థలం: Mumbai
ముంబై నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు రాబోయే ఏడు రోజుల పాటు తాగునీటిని మరిగించి వడకట్టుకోవాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. జలాశయాల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల నేపథ్యంలో నీటి నాణ్యత మారుతుందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం థానే, భివాండి ప్రాంతాలకు కూడా వర్తిస్తుందని, ప్రజలు తగిన అప్రమత్తత పాటించాలని అధికారులు పేర్కొన్నారు.