గణేష్ విగ్రహాలను జేసీబీలతో ముక్కలు చేయడం బాధాకరమన్న కౌశిక్ రెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: హుజూరాబాద్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో వినాయక నిమజ్జన సమయంలో జరిగిన దారుణ ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజించిన గణేష్ విగ్రహాలను జేసీబీలతో ముక్కలు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్థానికంగా సర్వత్రా చర్చనీయాంశమైంది.