శ్రీశైలంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఈవో శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు
రిపోర్టర్: రమేష్
స్థలం: Nandyal
శ్రీశైల క్షేత్రంలో భక్తులకు అందుతున్న మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే దిశగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు గురువారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాతాళగంగ స్నానఘట్టాలు, సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం, శౌచాలయాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాతాళగంగ వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అదనపు విద్యుద్దీపాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.