జీ5లో దూసుకుపోతున్న పంచనామా వెబ్ సిరీస్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పంచనామా వెబ్ సిరీస్ జీ5లో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతూ కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. ఉదయభాను నిర్మాతగా వ్యవహరించిన ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్ సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.