'దరఖాస్తులు ప్రారంభం..': యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష ప్రకటన విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 6, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక పరీక్ష జనవరి 31, 2027న, ప్రధాన పరీక్ష జూన్ 18, 2027న నిర్వహించనున్నారు. 21 నుండి 30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులని కమిషన్ వెల్లడించింది.