వైద్య సీట్ల పెంపు: అనుమతికి మించి ప్రవేశాలు ఇస్తే కఠిన చర్యలు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల వివరాలను ఎన్‌ఎంసీ విడుదల చేసింది. ఆమోదిత సీట్లకు మించి అదనంగా ప్రవేశాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏపీలో కొత్తగా 525 సీట్లు పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 7,615కి చేరింది. కేవలం ఆమోదిత సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.