'గాలేరు నగరి కాలువలో ముగ్గురు గల్లంతు': నంద్యాలలో తీవ్ర విషాదం

రిపోర్టర్: హరి స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం సమీపంలోని గాలేరు నగరి కాలువ వద్ద సరదాగా నీటి ప్రవాహం చూసేందుకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. రామాపురానికి చెందిన ఆఫీస్ (32), ఆయన కుమారుడు ఆరిఫ్ (5), బావమరిది ఆసిఫ్ (26) కాలువలో కొట్టుకుపోయారు. గణేశ్ నిమజ్జనం సెలవు కావడంతో కాలువ వద్దకు వెళ్లిన సమయంలో చిన్నారి కాలువలో పడగా, కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి, బావమరిది కూడా నీటి ఉద్ధృతికి గల్లంతయ్యారు. గండికోటకు 3500 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో ప్రవాహం ఉద్ధృతంగా ఉందని, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.