కూరగాయలు, పండ్లతో వినూత్న పొడులు తయారు చేస్తున్న ఉద్యాన వర్సిటీ విద్యార్థినులు

రిపోర్టర్: మహేష్ స్థలం: పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉద్యానవన విశ్వవిద్యాలయ విద్యార్థినులు డీహైడ్రేషన్ సాంకేతికతతో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. సోలార్ డ్రైయర్ల సాయంతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను 50 రకాల పొడులు, డ్రై ఫ్లేక్స్‌గా మారుస్తున్నారు. చదువుతూనే వ్యాపారవేత్తలుగా ఎదుగుతూ, భవిష్యత్తులో ఈ పరిశ్రమను ఆన్‌లైన్‌కూ విస్తరించి మరికొందరికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని వారు చెబుతున్నారు.