హైదరాబాద్‌లో సైబర్ మోసం: తక్కువ ధరకే సిమెంట్ ఇస్తామంటూ బాధితుడికి భారీ టోపీ
రిపోర్టర్: శివ
స్థలం: నిర్మల్
తక్కువ ధరకే బ్రాండెడ్ సిమెంట్ ఇస్తామంటూ రాష్ట్రంలో కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా కౌట్ల గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్న ఓ యజమానిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, రూ. 310 బస్తాను రూ. 260కే ఇస్తామని నమ్మించారు. డీలర్ సిమెంట్ దించుతున్న సమయంలో ఫోన్‌పే ద్వారా రూ. 65 వేలు వేరే అపరిచితుడి ఖాతాకు బదిలీ చేయించుకుని మోసగించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు.