మహాలయ పక్షాలలో తర్పణాల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటన

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి

శ్రీ కపిలేశ్వర తర్పణ బ్రాహ్మణ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు కపిల తీర్థం ప్రాంగణంలో పితృ తర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గౌరవ సలహాదారు సంస్కార్ రాజేష్ ఈ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. పితృ రుణాలు తీర్చుకోవడానికి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంఘం అధ్యక్షుడు మోహన్ కుమార్ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.