వ్యాపార రంగంలో సంచలనం: బిలియన్ డాలర్ల మార్ కు చేరిన టామ్ బ్రాడీ కంపెనీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

అమెరికా ఫుట్ బాల్ దిగ్గజం టామ్ బ్రాడీకి చెందిన ప్రముఖ బ్రాండ్ నోబుల్ సంస్థ బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్కును చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ సంస్థలో ప్రైవేట్ ఈక్విటీ పార్ట్నర్ ద్వారా యాభై మిలియన్ డాలర్ల నిధులు సమకూరడంతో బ్రాడీ సంపద భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. గతంలోనే బ్రాడీ తన బ్రాండ్లను ఈ కంపెనీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.