తోటపల్లిలో ఘనంగా గణనాథుని నిమజ్జనం రూ.75,116 పలికిన లడ్డు

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో శక్తి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జనం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పదమూడు రోజులపాటు పూజలందుకున్న లడ్డును యూత్ సభ్యులు వేలం వేశారు. హోరాహోరీగా సాగిన వేలంలో సుద్దకల్ వాస్తవ్యులు పుట్ట రామకృష్ణ రూ.75,116లకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు మంగళహారతులతో వినాయకునికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.