దిల్లీ వెలుపల తొలిసారిగా జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం
రిపోర్టర్: కిరణ్
స్థలం: గుజరాత్
జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో దశాబ్దాల సంప్రదాయానికి బ్రేక్ పడింది. తొలిసారిగా దిల్లీ వెలుపల గుజరాత్ ఏక్తా నగర్ వేదికగా 72వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ వేడుకను తొలిసారిగా మారుస్తూ కెవాడియాలో నిర్వహిస్తున్నారు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ అవార్డులను దక్కించుకున్నారు.