డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదంటూ మంత్రి ఆనం విమర్శ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు

ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో కూటమి సభ్యులతో నిర్వహించిన తొలి సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డీఎస్సీ ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఎల్లప్పుడూ ఏదో ఒక అంశంపై రాద్ధాంతం చేయడమే ప్రతిపక్షాల పనిగా మారిందని, తాము మాత్రం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.