ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక: ఐదు శాతం కరవు భత్యం పెంపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల కరవు భత్యం ఐదు శాతం పెంచుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. దీంతో డీఏ 58 శాతం నుంచి 63 శాతానికి చేరింది. ఈ తాజా పెంపు ద్వారా లక్షలాది మంది ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది.