ప్రకృతిని కాపాడుతూ ఇంటింటికీ మట్టి వినాయకులు పంపిణీ

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామ పంచాయతీలో జనసేన మండల అధ్యక్షులు పైడి మురళీ మోహన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా 511 మట్టి వినాయక విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రసాయన విగ్రహాలను వారించి మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో పర్యావరణ స్పృహ కల్పించారు.