దిశా సలియాన్ కేసులో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: మహారాష్ట్ర
మాజీ బాలీవుడ్ మేనేజర్ దిశా సలియాన్ మృతి కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అత్యంత ఘాటుగా స్పందించారు. తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కావాలనే తమ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా, వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా రాజకీయ ఒత్తిళ్లతో సీబీఐ వ్యవహరిస్తోందని ఆరోపించిన ఉద్ధవ్ ఠాక్రే, తప్పుడు ఆరోపణలు చేసేవారిపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.