రీ సర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ఇంచార్జ్ కలెక్టర్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించి, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి, సర్వే కార్యక్రమంలో రైతులు చురుగ్గా పాల్గొని సహకరించాలని కోరారు. పనులను నాణ్యతతో, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.