అక్టోబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సమయాల్లో మార్పు
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి అక్టోబర్ నెలకు వేళల్లో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా అక్టోబర్ మొదటి తేదీన ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం నుంచి మాత్రమే గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా నగదు పంపిణీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఉదయం సమయంలో బ్యాంకుల్లో నిధులు డ్రా చేసి, మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తామని అధికారులు తెలిపారు.